బుధవారం 27 మే 2020
Cinema - May 14, 2020 , 09:31:19

ఎట్ట‌కేల‌కి ఏడ‌డుగులు వేసిన నిఖిల్

ఎట్ట‌కేల‌కి ఏడ‌డుగులు వేసిన నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ ఎట్ట‌కేల‌కి త‌న ప్రేయ‌సితో ఏడ‌డుగులు వేశాడు. ఈ రోజు ఉద‌యం 6.31ని.ల‌కి నిఖిల్ వివాహం పల్లవివర్మతో నిరాడంబరంగా జ‌రిగింది. కేవ‌లం కుటుంబ స‌భ్యులు, సన్నిహితుల స‌మ‌క్షంలో షామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లో వీరి వివాహం జరిగింది. బుధవారం రోజు నిఖిల్‌ని పెళ్లి కొడుకుని చేయ‌గా, పసుపురంగు షేర్వాణీలో మెరిసారు . నిఖిల్‌ ఫొటోలు  అభిమానుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అస‌లు నిఖిల్‌, పల్లవివర్మ వివాహం ఏప్రిల్‌ 16న జరగాల్సి ఉండగా,  కరోనా ప్రభావంతో వాయిదాపడింది.

నిఖిల్ పల్లవి పెళ్లి ఫోటోల కోసం క్లిక్ చేయండి


logo