శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 04, 2020 , 08:51:58

నీ రాక‌తో నా జీవితం ఆనంద‌మ‌యంగా మారింది: నిఖిల్

నీ రాక‌తో నా జీవితం ఆనంద‌మ‌యంగా మారింది:  నిఖిల్

టాలీవుడ్ కుర్ర హీరో నిఖిల్ లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న ప్రేయ‌సి ప‌ల్ల‌వితో ఏడ‌డుగులు వేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం త‌న భార్య‌తో క‌లిసి జాలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే సెప్టెంబ‌ర్ 3న ప‌ల్ల‌వి వ‌ర్మ బ‌ర్త్‌డే కావ‌డంతో.. ఆమెతో దిగిన ఫోటో షేర్ చేస్తూ ఎమోష‌న‌ల్ కామెంట్ పెట్టాడు. 

నా ప్రియ‌మైన భార్య‌కు హ్యాపీ బ‌ర్త్ డే. నువ్వు నా జీవితంలో ఎప్పుడైతే వ‌చ్చావో అప్ప‌టి నుండి నా లైఫ్ అంతా ఆనంద‌మ‌యంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ని బ‌ట్టి నిఖిల్‌- ప‌ల్ల‌విలు త‌మ లైఫ్‌ను ఎంతో సంతోషంగా గడుపుతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. ఇక నిఖిల్ చివ‌రిగా అర్జున్ సుర‌వ‌రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ప్ర‌స్తుతం కార్తికేయ‌2 చిత్రంతో పాటు 18 పేజెస్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.