ఆదివారం 24 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 11:26:03

మెగా ఇంట్లో పెళ్ళి సంద‌డి.. చెల్లి పెళ్లికి అక్క‌ల హ‌డావిడి

మెగా ఇంట్లో పెళ్ళి సంద‌డి.. చెల్లి పెళ్లికి అక్క‌ల హ‌డావిడి

డిసెంబ‌ర్ 7న మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక‌.. చైత‌న్య‌తో ఏడ‌డుగులు వేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌స్తాన్ ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌తో వీరి వివాహం జ‌ర‌గ‌నుండ‌గా, పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను వ‌రుణ్ తేజ్ చూసుకుంటున్నాడు. మెగా రేంజ్‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఈ వేడుక‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెళ్ళికి రెండు రోజుల ముందే ఉద‌య్ పూర్ వెళ్ళి అక్క‌డ ప‌నుల‌ని ద‌గ్గ‌రుండి చూసుకోనున్నాడ‌ట‌.

మ‌రి కొద్ది రోజుల‌లో బ్యాచిల‌ర్ లైఫ్‌కు గుడ్ బై చెప్ప‌నున్న నిహారిక త‌న ఫ్రెండ్స్ , ఫ్యామిలీస్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఆ మ‌ధ్య త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి గోవాలో పార్టీ  చేసుకున్న ఈ అమ్మ‌డు తాజాగా  త‌న అక్క చెల్లెళ్ళ‌తో క‌లిసి ర‌చ్చ చేసింది.ఇందులో   చిరు పెద్ద కూతురు సుష్మిత, చిన్న కూతురు శ్రీజలు కూడా ఉన్నారు. చెల్లి పెళ్లి అనే క్యాప్షన్ పెట్టి నిహారిక షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.


logo