శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 24, 2021 , 21:23:37

‘మాస్టర్’ సినిమాపై నిహారిక అదిరిపోయే రివ్యూ

‘మాస్టర్’ సినిమాపై నిహారిక అదిరిపోయే రివ్యూ

లాక్ డౌన్ తర్వాత 10 నెలలు గ్యాప్ తీసుకుని థియేటర్స్ అన్నీ ఓపెన్ చేసినపుడు ముందులా ఆడియన్స్ వస్తారా లేదా అనే చిన్న అనుమానం ఉండేది. కానీ అలాంటి అనుమానాలు పటాపంచలు చేసింది మాస్టర్ సినిమా. విజయ్ హీరోగా ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు. ఈ సినిమాకు వస్తున్న వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే వారం రోజుల్లోనే 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. యావరేజ్ టాక్ తో మొదలైన మాస్టర్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ స్థాయికి చేరిపోయింది. 

విజయ్ లాంటి సూపర్ స్టార్ హీరో కావడంతో అభిమానులు మాస్టర్ కోసం థియేటర్స్ ముందు క్యూ కట్టారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రంపై నిహారిక అదిరిపోయే మెగా రివ్యూ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత థియేటర్ లో చూసిన తమిళ సినిమా కావడంతో బాగా ఎగ్జైట్ అయిపోయింది మెగా డాటర్. విజయ్, విజయ్ సేతుపతి లాంటి ఇద్దరు స్టార్స్ ను ఒకే తెరపై చూస్తుంటే తనకు పండగలా అనిపించిందని చెప్పింది నిహారిక. విజయ్ నటనకు ఫిదా అయిపోయానని.. విజయ్ సేతుపతి కుమ్మేసాడని.. ఆయన తన ఫేవరేట్ అని చెప్పుకొచ్చింది నిహారిక. ఎప్పట్లాగే సేతుపతి సర్ అభినయం అదిరిపోయిందని చెప్పింది ఈ మెగా బ్యూటీ. 

ఖైదీ సినిమాకు తాను పెద్ద అభిమాని అని.. ఇప్పుడు మాస్టర్ సినిమా కూడా అంతే ఎంజాయ్ చేసానని.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ వర్క్ చాలా బాగుందని చెప్పుకొచ్చింది నిహారిక. ఈ సినిమా డైలాగ్స్ కూడా తనకు చాలా బాగా నచ్చాయని చెప్పింది నిహా. అనిరుధ్ సంగీతం అదిరిపోయిందని.. తన బుర్రలోంచి మాస్టర్ మ్యూజిక్ బయటికి పోవడం లేదని చెప్పింది నిహారిక. ఈ సినిమాలో మరీ ముఖ్యంగా ఉన్న విజయ్ సేతుపతి స్నానం చేసే సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పింది. ఆ సీన్ అయితే నెక్ట్స్ లెవల్‌లో ఉందని.. చించేసారంటూ చెప్పుకొచ్చింది నిహారిక.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo