శనివారం 06 జూన్ 2020
Cinema - May 05, 2020 , 09:17:34

ఆవ‌కాయ ప‌చ్చ‌డి చేశాను.. ముద్ద‌ప‌ప్పుతో సిద్దంగా ఉండండి

ఆవ‌కాయ ప‌చ్చ‌డి చేశాను.. ముద్ద‌ప‌ప్పుతో సిద్దంగా ఉండండి

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య కొణిదెల నిహారిక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌. లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన ఈ అమ్మ‌డు టైం పాస్‌కోసం ప‌లు ఛాలెంజ్‌లు చేస్తూ మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఇంటి ప‌నుల్లో సాయ‌ప‌డుతుంది. తాజాగా ఆవ‌కాయ ప‌చ్చ‌డి పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ప్రసిద్ధ ఆవకాయ పచ్చడిని మొదటి సంవత్సరం తయారు చేశాను. కొంత ముద్ద పప్పుతో సిద్ధంగా ఉండండి  అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోతో నోరూరించింది నిహారిక‌. ఈ భామ ముద్ద‌ప‌ప్పు ఆవకాయ అనే వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆచార్య సినిమాలో న‌టిస్తున్న నిహారిక..త‌మిళంలో  యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఓ చిత్రం చేయ‌నుంది. 
logo