బుధవారం 03 జూన్ 2020
Cinema - May 01, 2020 , 17:04:56

మ‌నోహ‌ర పాట‌కి పోటా పోటీగా డ్యాన్స్ చేసిన నిహారిక‌, య‌శ్‌

మ‌నోహ‌ర పాట‌కి పోటా పోటీగా డ్యాన్స్ చేసిన నిహారిక‌, య‌శ్‌

మెగా హీరోయిన్ నిహారిక  అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా కొరియోగ్రాఫర్ య‌శ్‌తో క‌లిసి ఫ్లోర్ డ్యాన్స్ చేసింది. ఇందులో య‌శ్, నిహారిక‌లు పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ‘చెలి’ చిత్రంలోని మనోహర అనే రొమాంటిక్ పాట‌కి తగ్గ‌ట్టు  వీరిద్ద‌రు కాలు క‌దిపడం చూప‌రుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా చ‌క్క‌ర్లు కొడుతుంది. 

నిహారిక వెండితెర‌కి ఎంట్రీ ఇచ్చేముందు ముద్దప‌ప్పు ఆవ‌కాయ అనే వెబ్ సిరీస్ చేసి ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన సంగ‌తి తెలిసిందే. ఇక  ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర‌ని ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత  'హ్యాపీ వెడ్డింగ్',‘సూర్యకాంతం’ చిత్రాల‌లో న‌టించింది. ఈ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయాయి. ఇక రీసెంట్‌గా సైరా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నిహారిక  బోయ పిల్ల పాత్రలో అలా మెరిసి వెళ్లింది. ఆచార్య చిత్రంలోను కీల‌క పాత్ర పోషిస్తున్న నిహారిక త్వ‌ర‌లో రొమాంటిక్ జోన‌ర్‌లో త‌మిళ చిత్రం చేయ‌నుంది. 
logo