శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 18, 2021 , 22:15:27

ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!

ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!

పెళ్లికి ముందు..తర్వాత అని కాదు సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగానే ఉంటుంది నిహారిక. పెళ్లి సమయంలో కూడా రెగ్యులర్ గా పోస్టులు మాత్రం మిస్ కాలేదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టా పేజీలో అదిరిపోయే అప్ డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. దానికితోడు ఇప్పుడు కూడా అలాంటి అప్ డేట్ బయట పెట్టింది. అందులోనూ సీక్రెట్ చెప్పనంటూ పోస్ట్ చేసేసరికి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పెళ్లికి ముందు సింగిల్‌గా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన నిహారిక.. ఇప్పుడు భర్త అండతో  దూసుకుపోతుంది నిహారిక. పైగా నటించడానికి అడ్డంకులు లేకపోవడం.. అత్తారింటి నుంచి అనుమతులు కూడా రావడంతో వెంటనే రంగంలోకి దిగింది నిహారిక. ఇప్పటికప్పుడు సినిమాలు అయితే చేయడం లేదు కానీ వెబ్ సిరీస్ మాత్రం ఒప్పుకుంది నిహారిక.

ఈ మధ్యే మొదలైంది కూడా. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది. అందులో కీలకమైన పాత్రలో నటించబోతుంది నిహారిక. ఈమెతో పాటు అనసూయ కూడా నటించనుంది. జబర్దస్త్ యాంకర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా ఆనందంగా ఉందంటుంది మెగా డాటర్. ఇదిలా ఉంటే నటనతో పాటు పర్సనల్ లైఫ్ కు కూడా కావాల్సినంత టైమ్ ఇస్తుంది ఈ హీరోయిన్. మొన్నటి వరకు భర్తతో హనీమూన్ ఎంజాయ్ చేసొచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు కెరీర్‌లో బిజీ అయిపోయింది. వచ్చీ రావడంతోనే తన పని మొదలు పెట్టింది. అంతేకాదు మధ్యలో కవితలు కూడా రాస్తుంది నిహారిక. మొన్నామధ్య ఈమె నేచర్ గురించి పోస్ట్ చేసిన లైన్ ఒకటి వైరల్ అవుతుంది. చెట్ల మధ్యలో నిలబడి.. ఆకాశాన్ని చూస్తూ హాయిగా అక్కడి ప్రశాంతమైన వాతావరణం ఎంజాయ్ చేస్తుంది నిహారిక.

 ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే అది వైరల్ అవుతుందిప్పుడు. నువ్వొక్కసారి నీ చుట్టూ చూస్తే ఈ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది అని చెప్తుంది నిహా. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో పోస్ట్ చేసింది. అందులో సెంటర్ ఫ్రెష్ యాడ్ లో మాదిరి నోటికి తాళం వేసుకుంది నిహారిక. నేను ఆ సీక్రెట్ చెప్పను.. ఒకవేళ చెప్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది..అదేంటో జోసెఫ్ రాధిక్ కు ఒక్కడికే తెలుసు అంటూ పోస్ట్ చేసింది. జోసెఫ్ రాధిక్ అంటే వీళ్ళ పెళ్లికి ఫోటోలు చేసిన ఫోటోగ్రఫర్. ఏదేమైనా కూడా నిహారిక దాచిపెట్టిన ఆ సీక్రేట్ ఏంటో తెలియదు కానీ అభిమానులు మాత్రం కంగారు పడుతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

సంక్రాంతి హిట్‌పై క‌న్నేసిన సోనూసూద్‌..?

సురేంద‌ర్ రెడ్డికి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్

లైట్‌..కెమెరా..యాక్ష‌న్..'ఖిలాడి' సెట్స్ లో ర‌వితేజ‌

డెడ్ లైన్’ పెట్టుకున్న హీరోలు ?

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo