సోమవారం 18 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 18:13:45

నిహారిక పెళ్లి వేడుకల్లో మెగా సిస్టర్స్: ఫొటోలు వైరల్‌

నిహారిక పెళ్లి వేడుకల్లో మెగా సిస్టర్స్: ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక   మరికొన్ని రోజుల్లోనే జొన్నలగడ్డ ఫ్యామిలీలో చేరబోతోంది. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యను   నిహారిక పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. నిహారిక పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లోని కోటలో అంగరంగ వైభవంగా జరగనుంది.  డిసెంబర్ 9న జరగబోయే ఈ వేడుక కోసం ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్‌, అల్లు అర్జున్  మినహాయిస్తే మిగిలిన కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా అదిరిపోతున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

నిహారిక అక్కలు..చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  చిరు పెద్ద కూతురు సుష్మిత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను  అప్‌లోడ్‌ చేస్తున్నారు.    సుష్మిత, శ్రీజతో కలిసి కొత్త పెళ్లికూతురు నిహారిక దిగిన ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులను బాగా అలరిస్తుంది.    అయిపోతుంది. ఈ పెళ్లికి మెగా కుటుంబంతో పాటు ఇండస్ట్రీ నుంచి నాగార్జున, బాలయ్య, వెంకటేష్, రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి సహా మరికొందరు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.