శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 10, 2020 , 23:24:36

నిహారిక తప్పుకొంది మేఘా వచ్చింది

నిహారిక తప్పుకొంది మేఘా వచ్చింది

మెగా ప్రిన్సెస్‌ నిహారిక ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. త్వరలో ఆమె పెళ్లిపీటలెక్కనుంది. వివాహ తేదీలతో సినిమా డేట్స్‌ క్లాష్‌ కావడంతో  నిహారిక తాను అంగీకరించిన ఓ తమిళ సినిమా నుంచి తప్పుకొంది. ఆమె స్థానంలో చిత్రబృందం మేఘా ఆకాష్‌ను కథానాయికగా తీసుకున్నారు. తమిళంలో స్వాతిని దర్శకత్వంలో  రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా చేయబోతున్నట్లు మే నెలలో నిహారిక ప్రకటించింది. మహిళా ప్రధాన కథ కావడంతో నిహారిక ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకుంది.  నిహారికకు పెళ్లి కుదరడం, వివాహ తేదీలతో సినిమా కోసం కేటాయించిన  డేట్స్‌ క్లాష్‌ కావడంతో ఆమె  ఈ సినిమా నుంచి వైదొలిగినట్లుగా చిత్రబృందం ప్రకటించింది. నిహారిక స్థానంలో మేఘాఆకాష్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల మేఘా ఆకాష్‌ ఆనందాన్ని వ్యక్తంచేసింది. ‘విభిన్నమైన కథాంశాలతో నాయిక పాత్రలకు ప్రాధాన్యమున్న కథలు  లభించడం సులభం కాదు. అలాంటి అరుదైన అవకాశమిది’ అని తెలిపింది.