ఆదివారం 31 మే 2020
Cinema - May 03, 2020 , 22:35:12

తమిళ చిత్రంలో నిహారిక

తమిళ చిత్రంలో నిహారిక

2019లో విడుదలైన ‘సూర్యకాంతం’ తర్వాత  కొత్త సినిమాలపై సంతకం చేయలేదు నిహారిక కొణిదెల. కథాంశాలు, పాత్రల  ఎంపికలో పునరాలోచనలో పడిన ఆమె ఏడాదిపైనే విరామం తీసుకుంది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం  నిహారిక ఓ తమిళ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అశోక్‌సెల్వన్‌ కథానాయకుడిగా కెనన్య ఫిల్మ్స్‌ పతాకంపై  ఓ తమిళ చిత్రం తెరకెక్కనుంది. స్వాతిని దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో నిహారిక కొణిదెల కథానాయికగా నటించనుంది. తమిళ సినిమా అంగీకరించిన విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ధృవీకరించింది నిహారిక కొణిదెల. షూటింగ్‌ ఆరంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ తమిళ చిత్రం రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. తమిళంలో నిహారిక నటిస్తున్న రెండో సినిమా ఇది. 2018లో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా రూపొందిన ‘ఒరు నల్ల నాల్‌ పాతు సొల్రేన్‌' సినిమాలో నిహారిక కీలక పాత్రలో నటించింది. ‘సైరా’లో అతిథి పాత్రలో మెరిసింది నిహారిక.


logo