శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Jan 13, 2021 , 21:18:14

ఐ లవ్ యూ బంగారూ..నిహారిక కొణిదెల పోస్ట్ వైరల్

ఐ లవ్ యూ బంగారూ..నిహారిక కొణిదెల పోస్ట్ వైరల్

పెళ్లి తర్వాత మరింత ట్రెండ్ అవుతుంది నిహారిక కొణిదెల. జొన్నలగడ్డ కుటుంబంలోకి వెళ్లిన తర్వాత కూడా కొణిదెల వారమ్మాయి జోరు తగ్గడం లేదు. పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ లో బిజీగానే ఉంది నిహారిక. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వరస షోలు చేస్తూ బిజీ అయిపోయింది. ముఖ్యంగా ఈ మధ్యే వెబ్ సిరీస్ కూడా మొదలు పెట్టింది. అందులో యాంకర్ అనసూయ భరద్వాజ్ తో కలిసి నటించనుంది నిహారిక. భర్త చైతన్య జొన్నలగడ్డతో హనీమూన్ ఎంజాయ్ చేసొచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కెరీర్ లో బిజీ అయిపోయింది. ఈ మధ్యే మాల్దీవుల‌కు వారం రోజుల పాటు వెళ్లొచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ హీరోకు ఐ లవ్ యూ బంగారూ అంటూ పోస్ట్ పెట్టింది నిహారిక. అక్కడ బంగారూ అంటే భర్త చైతన్య కాదు.. బావ వైష్ణవ్ తేజ్. 

నిహారికకు బావలు చాలా మందే ఉన్నారు. అంటే అత్త కొడుకులు అన్నమాట. అంతా చాలా ప్రేమగా ఉంటారు. చిన్నప్పటి నుంచి అంతా కలిసే పెరగడంతో ఆ ప్రేమలు ఆప్యాయతలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంతేకాదు అమ్మాయిలను కూడా మరదళ్ళుగా కాకుండా చెల్లెళ్లుగానే చూస్తుంటారు. నిహారిక విషయంలో అంతా చెల్లి అంటారు. వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా వరసకు బావలు అయినా కూడా అన్నయ్యలే అంటుంది ఈమె. తాజాగా ఉప్పెన హీరో జనవరి 13న పుట్టిన రోజు సందర్భంగా ఐ లవ్ యూ బంగారు.. నీకు తెలుసు నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో.. లవ్ యూ వైష్ గా అంటూ పోస్ట్ చేసింది నిహారిక. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. 

మొన్న తన పెళ్లిలో వైష్ణవ్‌ తేజ్‌ను కౌగిలించుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. తనకంటే ఒక్క ఏడాది పెద్దవాడైన వైష్ణవ్ తేజ్‌తో చాలా క్లోజ్ గా ఉంటుంది నిహారిక. పెళ్లి కంటే ముందు కూడా కొన్నిసార్లు వీళ్ల ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. అందులో చాలా సరదాగా ఆడుకుంటూ.. ఆట పట్టించుకుంటూ కనిపించారు. ఇప్పటికీ అదే బంధం కొనసాగుతుంది. మొన్న నిహారిక పెళ్లిలో కూడా అంతా దగ్గరుండి ఫుల్లుగా ఎంజాయ్ చేసారు. ఏదేమైనా కూడా ఐ లవ్ యూ బంగారు పోస్ట్ మాత్రం ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.


ఇవి కూడా చ‌ద‌వండి

మ‌తి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ..ఫొటోలు వైర‌ల్

అన‌సూయకు సూప‌ర్‌స్టార్ తో న‌టించే ఛాన్స్ ..?

త్రివిక్ర‌మ్ తో నా సినిమా ప‌క్కా ఉంట‌ది: రామ్

‘టైమ్ ’చూసి దిగుతున్నారు

త్రివిక్ర‌మ్‌తో సినిమాపై రామ్ స్పంద‌న ఏంటి?

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?

12 కి.మీ సైకిల్ తొక్కిన‌ ర‌కుల్‌..ఎందుకంటే..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo