గురువారం 28 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 19:10:03

నిహారిక ఫ్యూచర్ ప్లాన్ ఏంటి.. పెళ్ళి తర్వాత సినిమాలు చేస్తుందా..?

నిహారిక ఫ్యూచర్ ప్లాన్ ఏంటి.. పెళ్ళి తర్వాత సినిమాలు చేస్తుందా..?

హైద‌రాబాద్ : తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వారసురాళ్లు సక్సెస్ అయింది లేదు. కృష్ణ నట వారసురాలు మంజుల నుంచి మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి వరకు స్టార్స్ అయింది లేదు. ఏదో అలా వచ్చి సినిమాలు అయితే చేసారు కానీ స్టార్ హీరోయిన్స్ మాత్రం కాలేదు. ఆ తర్వాత మెగా కుటుంబం నుంచి నిహారిక వచ్చింది. ఒక మనసు అంటూ ప్రేక్షకులను పలకరించిన నిహారిక ఆ సినిమాతో అలరించలేకపోయింది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి సినిమాలు చేసింది. అయినా కూడా సక్సెస్ అందుకోలేక‌పోయింది. సైరా లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది ఈ మెగా డాటర్. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైపోయింది. డిసెంబర్ 9న ఉదయ్‌పూర్‌లో ఈమె పెళ్లి జరగబోతుంది. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంటుంది నిహారిక. 

అయితే పెళ్లి తర్వాత నిహారిక సినిమాలు చేస్తుందా? చేయదా? అనే అనుమానాలు మాత్రం అభిమానుల్లో అలాగే ఉండిపోయాయి. మనసుకు నచ్చిన పాత్రలు వస్తే ఎప్పటికీ నటిస్తూనే ఉంటానంటూ ఆ మధ్య చెప్పుకొచ్చింది ఈ భామ. అయితే ఇప్పుడు పెళ్లి అవుతుంది కదా మళ్లీ మనసు మార్చుకుందా లేదంటే అదే మాట మీదుండి సినిమాల్లో న‌టిస్తుందా అనంత‌రం కాలంలో తెలియ‌నుంది. ప్రస్తుతానికి వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే పెళ్ళి తర్వాత నిహారిక సినిమాలు చేయకపోవచ్చనే తెలుస్తుంది. కేవలం నటనకు మాత్రమే దూరం కానుంది కానీ ఇండస్ట్రీకి మాత్రం కాదని ప్రచారం జరుగుతుంది. 

శ్రీమతి అయిన తర్వాత సినిమాలు చేస్తుంది కానీ నటిగా కాకుండా నిర్మాతగా అని తెలుస్తుంది. ఇప్పటికే నిహారికకు ఓ నిర్మాణ సంస్థ ఉంది. అందులో కొన్ని వెబ్ సిరీస్ లు చేసింది. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ చేయాలని చూస్తుంది నిహా. పెళ్లి తర్వాత వరసగా వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే కథలు కూడా విని వాటికి ప్రీ ప్రొడక్షన్ చేయమని చెప్పిన‌ట్లుగా స‌మాచారం. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత నిర్మాతగా బిజీ కానుంది కానీ నటిగా మాత్రం కాదని తెలుస్తుంది. ఇదే జరిగితే నటిగా నిహారిక కెరీర్ పెళ్లితోనే ఫుల్ స్టాప్ పడనుంది. 


logo