శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 17, 2020 , 14:59:09

డిసెంబ‌ర్‌లో నిహారిక పెళ్ళి.. ఏర్పాట్లు చేస్తున్న నాగ‌బాబు

డిసెంబ‌ర్‌లో నిహారిక పెళ్ళి..  ఏర్పాట్లు చేస్తున్న నాగ‌బాబు

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ముద్దుల త‌న‌య నిహారిక‌కు క‌ళ్యాణ ఘ‌డియ వ‌చ్చేసింది. డిసెంబ‌ర్‌లో గుంటూరుకి చెందిన‌  పోలీస్‌ ఆఫీసర్‌ కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో  నిహారిక  ఏడ‌డుగులు వేయ‌నుంది. డెస్టినేష‌‌న్ వెడ్డింగ్‌గా నిహారిక పెళ్లి వేడుక‌ని డిసెంబ‌ర్‌లో జ‌ర‌పాల‌ని మెగా ఫ్యామిలీ భావిస్తుంద‌ట‌. ఇక వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం త‌న చెల్లి పెళ్ళి ప‌నుల‌తో బిజీగా ఉండ‌గా, ఏ ప్రాంతంలో పెళ్లి జ‌ర‌పాల‌నే దానిపై ఓ జాబితాను సిద్ధం చేసుకుంటున్నాడ‌ని నాగ‌బాబు ఇంగ్లీష్ మీడియాతో చెప్పుకొచ్చారు. 

అతి త్వ‌ర‌లోనే నిహారిక పెళ్లి తేదీని అఫీషియ‌ల్‌గా ప్ర‌కటిస్తామ‌ని నాగ‌బాబు అంటున్నారు. ఇదిలా ఉంటే నిహారిక , చైత‌న్య‌ల‌కు ఆగ‌స్ట్ 13న నిశ్చితార్దం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌కు చిరంజీవి-సురేఖ‌, రామ్ చ‌ర‌ణ్ -ఉపాస‌న‌, అల్లు అర్జున్-స్నేహా రెడ్డిల‌తో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్, ప‌లువురు కుటుంబ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. కాగా,  నిహారిక  కొద్ది రోజుల క్రితం త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి గోవాలో బ్యాచ్‌లర్ పార్టీ జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే.