బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 25, 2021 , 21:05:53

చైతన్య చేసిన పనికి ఏడ్చేసిన నిహారిక..వీడియో

చైతన్య చేసిన పనికి ఏడ్చేసిన నిహారిక..వీడియో

పెళ్ళి తర్వాత కూడా సోషల్ మీడియాలో బిజీ అయిపోయింది మెగా డాటర్ నిహారిక. అప్పటి పెళ్లి ముచ్చట్లు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది నిహారిక. తన పెళ్లి గురించి.. అప్పుడు జరిగిన విశేషాల గురించి అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఇప్పుడు కూడా తాజాగా మరో వీడియోను విడుదల చేసింది ఈమె. కాకపోతే ఈ వీడియోలో మెగా డాటర్ ఏడుస్తూనే ఉంది. తన భర్త చైతన్య చేసిన పనికి నిహారిక కన్నీరు పెట్టుకుంది. అయితే అవి ఆనంద భాష్పాలే కానీ నిజంగా కన్నీరు కావు. తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో తన భార్య నిహారికను ప్రేమతో ఏడిపించేసాడు చైతన్య. అలాంటి ఓ ఎమోషనల్ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది నిహారిక కొణిదెల. ఈ కొణిదెల వారమ్మాయి పెళ్ళి ఉదయపూర్ కోటలో మూడు రోజుల పాటు ఘనంగా జరిగింది. 

అక్కడే మెగా ఫ్యామిలీ అంతా ఉండి నిహారిక పెళ్లి చేసారు. అప్పగింతల సమయంలో అమ్మాయిలు ఏడవడం కామన్ కానీ నిహారిక మాత్రం పెళ్లి పీటలెక్కకుండానే కన్నీరు పెట్టుకుంది. దానికి కారణం చైతన్య చేసిన పనే. తన ప్రేమతో నిహారిక గుండె లోతుల్లోకి నేరుగా వెళ్లిపోయాడు చైతన్య. భార్య కోసం ఈయన చేసిన ఓ వీడియోను చూసి నిహారిక ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. ‘డియర్ నిహా.. పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న ఈ తరుణంలో నీకు ఒక విషయాన్ని చెప్పాలి.. 30 ఏళ్ళ నా జీవితంలో నేనేం మిస్ అయ్యానో.. ఏది కోల్పోయానో నువ్వొచ్చిన తర్వాతే తెలిసింది.. నీతో గడపబోయే ప్రతీ క్షణం శ్వాస ఆగిపోయేవరకు గుర్తు పెట్టుకుంటాను’ అంటూ తన భార్య గురించి చాలా ఎమోషనల్ అయిపోయాడు చైతన్య జొన్నలగడ్డ. 

అంతేకాదు తాను పుట్టిందే నిహారిక కోసం అంటూ సెంటిమెంటల్ డైలాగులు కూడా చెప్పాడు చైతన్య. ఇంత బాగా చెప్పిన తర్వాత ఏ అమ్మాయి అయినా ఏడవకుండా ఎందుకుంటుంది.. ఎమోషనల్ అవ్వకుండా ఎలా కంట్రోల్ చేసుకుంటుంది. నిహారిక ఏడుస్తుంటే పక్కనే ఉన్న అక్క సుష్మిత ఈమెను కౌగిలించుకుని ఓదార్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డిసెంబర్ 9న చైతన్యను పెళ్లి చేసుకున్న నిహారిక.. ఆ తర్వాత మాల్దీవ్స్ కు హనీమూన్ వెళ్లొచ్చారు. ఆ తర్వాత వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు పెట్టింది ఈ మెగా డాటర్. పెళ్ళి తర్వాత కూడా సినిమాలు చేస్తానని ఈ ఒక్క మాటతోనే ప్రూవ్ చేసింది ఈ బ్యూటీ.ఇవి కూడా చ‌ద‌వండి..

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

ఇండోనేషియాలో తెనాలి భామ షికారు

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్

'స‌ర్కారు వారి పాట' ఖాతాలో స‌రికొత్త రికార్డ్

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూట్ షురూ ..వీడియో

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

వ‌రుణ్‌ధ‌వ‌న్ వెడ్డింగ్‌కు తార‌‌లు..ఫొటోలు, వీడియో

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo