శనివారం 23 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 14:26:04

నిహారిక ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌

నిహారిక ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌

డిసెంబ‌ర్ 9న రాజ‌స్థాన్‌లోని ఉద‌య్ పూర్ ప్యాలెస్ వేదిక‌గా నిహారిక వివాహం చైత‌న్య‌తో జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ పూర్తి కాగా, మ‌రో రెండు రోజుల‌లో మెగా ఫ్యామిలీ అంతా అక్క‌డ ప్ర‌త్య‌క్షం కానుంది. మెహందీ, సంగీత్ వంటి కార్య‌క్ర‌మాల‌తో తెగ సంద‌డి చేయ‌నున్నారు.

కొద్ది రోజులుగా నిహారిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుగుతుండ‌గా, అందుకు సంబంధించి  ప‌లు ఫొటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. తాజాగా నిహారిక‌ని పెళ్లి కూతురు చేసే కార్య‌క్ర‌మంకి సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వీటిని చూసిన నెటిజ‌న్స్ నిహారిక‌కు పెళ్లి క‌ళ వ‌చ్చేసిందే బాల అంటూ కామెంట్స్ పెడుతున్నారు.logo