గురువారం 21 జనవరి 2021
Cinema - Dec 04, 2020 , 12:41:53

నిహారిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్ ఫొటోలు వైర‌ల్

నిహారిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్ ఫొటోలు వైర‌ల్

నాగ‌బాబు ముద్దుల త‌న‌య నిహారిక డిసెంబ‌ర్ 9న ఉద‌య్ పూర్ ప్యాలెస్ వేదిక‌గా చైత‌న్య‌ని వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. గ‌త మూడు రోజులుగా నిహా-చైల ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రుగుతుండ‌గా ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా నిహారిక త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ మూడు ఫొటోలు షేర్ చేసింది.

ఈ ఫొటోల‌లో ఇద్ద‌రు అమ్మాయిలు నిహారిక కాళ్ళు ప‌ట్టుకున్న‌ట్టు క‌నిపిస్తుండ‌గా, నిహా మాత్రం తెగ న‌వ్వేస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చింది. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చిన మెగా ప్రిన్స్ .. వాళ్ళు నా హీల్స్ సెట్ చేస్తున్నారు. ఒక పెళ్లి కూతురికి స‌హాయ‌కురాలిగా వాళ్ల క‌ర్త‌వ్యం బాగా చేస్తున్నారు. ల‌వ్ యూ గార్ల్ అంటూ నిహారిక కామెంట్ పెట్టింది. కాగా, నిహారిక-చైత‌న్య పెళ్లి వేడుక రాజ‌స్తాన్‌లో జ‌ర‌గ‌నుండ‌గా, డిసెంబ‌ర్ 11న హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది.logo