ఆదివారం 17 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 11:01:16

ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ మొద‌లు.. ఒకే ఫ్రేములో మెగా గ్యాంగ్

ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ మొద‌లు.. ఒకే ఫ్రేములో మెగా గ్యాంగ్

మెగా వారింట పెళ్ళి సంద‌డి నెల‌కొంది. మ‌రో ఆరు రోజుల‌లో నిహారిక వివాహం.. జొన్న‌లగ‌డ్డ చైత‌న్యతో జ‌ర‌గ‌నుండ‌గా, వీరి పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తైన‌ట్టు తెలుస్తుంది. వ‌రుణ్‌తేజ్ ద‌గ్గ‌రుండి ఈ  పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. ఇప్ప‌టికే హ‌ల్దీ వేడుక పూర్తి కాగా, మ‌రి కొద్ది రోజుల‌లో మెహందీ, సంగీత్ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. చాలా రోజుల తర్వాత మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి హ‌డావిడి నెల‌కొన‌డంతో అంద‌రు ఒకే చోట చేరారు. ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా నిహారిక‌, చైత‌న్య‌తో క‌లిసి శ్రీజ, సుస్మిత‌, స్నేహా రెడ్డి, శిరీష్‌, సాయి ధ‌రమ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్, వ‌రుణ్ తేజ్, అల్లు శిరీష్ ఇలా త‌దిత‌రులు సంద‌డి చేశారు. 

డిసెంబ‌ర్ 9న నిహారిక‌-చైత‌న్య‌ల వివాహం రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ ప్యాలెస్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కి కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే హాజ‌రు కానున్నారు. డిసెంబ‌ర్ 11న హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్ ప్లాన్ చేయ‌గా, ఈ వేడుక‌కి ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌ని ఆహ్వానించ‌నున్నారు. కాగా, రీసెంట్‌గా నిహారిక వెడ్డింగ్ కార్డ్ ఒక‌టి  సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే.