శనివారం 06 జూన్ 2020
Cinema - May 13, 2020 , 22:40:15

తెలుగు అబ్బాయిలు నాకు తెలుసు

తెలుగు అబ్బాయిలు నాకు తెలుసు

లాక్‌డౌన్‌ టైమ్‌ను కెరీర్‌ ఉన్నతి కోసం ఉపయోగించుకుంటోంది ముంబయి ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. నటన, ఫిల్మ్‌మేకింగ్‌లలో ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ తీసుకుంటోంది.  ఈ విరామంలోనే కొత్త భాషలపై పట్టు సాధించే పనిలో పడింది.  ప్రేమ, ద్వేషం, హృదయం లాంటి ఇంగ్లీష్‌ పదాలకు తమిళ అర్థాలు రాసి ఉన్న  పేపర్‌ను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది నిధి అగర్వాల్‌. ‘కొత్త భాషను నేర్చుకుంటున్నాదు. ఇది ఏ భాషనో ఊహించండి’ వ్యాఖ్యానించింది. అంతేకాదు ‘తెలుగు అబ్బాయిలు నాకు తెలుసు. తెలుగు  బాగా వస్తుంది’ అంటూ మరో ట్వీట్‌ పెట్టింది. భవిష్యత్తులో తెలుగు, తమిళ  చిత్రాలకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పాలనే ఆలోచనతోనే నిధి అగర్వాల్‌ భాషప్రావీణ్యాన్ని పెంచుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తమిళంలో జయంరవి సరసన ‘భూమి’ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో రవితేజతో ఓ సినిమాను అంగీకరించింది. 


logo