పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో లైమ్ లైట్లోకి వచ్చిన నిధి అగర్వాల్ తన జోరు కొనసాగిస్తుంది. ఒకవైపు సినిమాలు మరోవైపు ఫొటోషూట్స్‌తో నానా హంగామా చేస్తుంది. ఈ అమ్మడకి పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లులో క్రేజీ పాత్ర దక్కింది. అలానే తమిళంలో సెల్వరాఘవన్ శిష్యుడు మాఘిజ్ తిరుమేని దర్శకత్వంలో నిధి ఓ సినిమా చేస్తోంది. బాలీవుడ్‌లోను పలు ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫొటో షూట్స్‌తో యువతను కవిస్తూనే ఉంటుంది. ఆమె కిల్లర్ లుక్స్‌తో పాటు అందచందాలకు ప్రతి ఒక్కరు మంత్రముగ్దులవుతుంటారు. తాజాగా వెరైటీ డ్రెస్‌లలో డిఫరెంట్ యాంగిల్స్ పెడుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోషూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.