అక్కినేని హీరోలు నాగ చైతన్య, అఖిల్‌లతో కలిసి పని చేసిన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. ఈ అమ్మడికి ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి ఆదరణ దక్కింది. ఇక అక్కడ నుండి నిధి స్పీడ్ జెట్‌లా దూసుకుపోతుంది. నిధి అగర్వాల్ తక్కువ సమయంలోనే పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లులో నటించే ఛాన్స్ కొట్టేసింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి నర్తకిగా నటిస్తోంది.
మహేష్ కజిన్ గల్లా అశోక్ సరసన కూడా నిధి నటిస్తోంది. ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ-గల్లా అరుణకుమారి సమర్పణలో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. అమర్ రాజా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలో మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నిధి అగర్వాల్ తన అందాలతో అభిమానులకి గాలం వేస్తూనే ఉంటుంది.
నిధి ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఇన్ స్టాలో కోటి 30లక్షల (13 మిలియన్) మంది ఫాలోవర్స్ ని సాధించింది. ఈ సందర్భంగా లేటెస్ట్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన గోధుమ రంగు దుస్తులలో నిధి మెరిసిపోయింది.