శనివారం 30 మే 2020
Cinema - May 23, 2020 , 23:12:04

అమితాబ్‌ ‘జుండ్‌' సినిమా కాపీరైట్స్‌ పై వివాదం

అమితాబ్‌ ‘జుండ్‌' సినిమా కాపీరైట్స్‌ పై వివాదం

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించి ఆన్‌లైన్‌, ఓటీటీ వేదికల్లో విడుదలకు సిద్ధమవుతున్న జుండ్‌ సినిమాపై కాపీరైట్స్‌ వివాదం నెలకొన్నది. స్లమ్‌ సాకర్‌ ఛాంపియన్‌ అఖిలేశ్‌పాల్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తీసిన ఈ సినిమా కాపీరైట్స్‌ తనకే ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ నంది చిన్నికుమార్‌ మియాపూర్‌ 15వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సినిమా దర్శక నిర్మాత నాగరాజ్‌ ముంజెలె, అమితాబ్‌బచ్చన్‌, నెట్‌ఫ్లిక్స్‌, టీ-సిరీస్‌ తదితర సంస్థలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. కోర్టు నోటీసుల మేరకు ప్రతివాదులు సైతం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. తాము ఎవరి కాపీరైట్స్‌ హక్కులను ఉల్లంఘించలేదని, జుండ్‌ సినిమాను పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమే తీశామని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న 15వ అదనపు జిల్లా జడ్జి తదుపరి ఉత్తర్వుల కోసం ఈనెల 28కి వాయిదా వేశారు. 


logo