మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 19:45:11

భర్త వేధిస్తున్నాడని పోలీసులకు నటి పూనం పాండే ఫిర్యాదు

భర్త వేధిస్తున్నాడని పోలీసులకు నటి పూనం పాండే ఫిర్యాదు

పనాజీ: ఇటీవలే వివాహం చేసుకున్న నటి పూనం పాండే తన భర్త తనను వేధింపులకు గుర్తిచేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త సామ్‌బాంబేను గోవా పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. దక్షిణ గోవాలోని కెనాకోనా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం పాండే ఇక్కడ ఒక చిత్రం షూటింగ్‌లో ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు.

‘నా భర్త సామ్ బాంబే నన్ను వేధింపులకు గురిచేస్తున్నాడు. దాడిచేసి అనంతరం బెదిరించాడు అని పాండే సోమవారం ఫిర్యాదు చేశారు. సామ్‌బాంబేను అరెస్ట్‌ చేశాం’ అని  కెనకోనా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ తుకారాం చవాన్ చెప్పారు. ఆమెకు వైద్య పరీక్షలు చేయించినట్లు తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo