మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 12, 2020 , 19:18:50

ల్యాప్‌టాప్‌తో రానా-మిహికా..ఫొటో చక్కర్లు

ల్యాప్‌టాప్‌తో రానా-మిహికా..ఫొటో చక్కర్లు

రానా-మిహికా దంపతులు పోస్ట్‌ వెడ్డింగ్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో రానా-మిహికా బజాజ్‌ సత్యనారాయణ వ్ర‌తంలో పాల్గొన్నారు. పూజ అనంతరం  మిహికాకు రానా ల్యాప్‌టాప్‌లో ఫొటోలు చూపిస్తుండగా..వాటిని చూసి మిహికా నవ్వుతోంది. రానా-మిహికా సంప్రదాయ వస్త్రధారణలో పక్కపక్కనే కూర్చొని నవ్వుతున్న ఈ స్టిల్‌ ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ రూల్స్‌ను పాటిస్తూ..అతికొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో రానా-మిహికా పెండ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే.

స‌త్య‌నారాయ‌ణ వ్ర‌తం త‌ర్వాత ఫ్యామిలీ అంతా నూత‌న వ‌ధూవ‌రుల‌తో క‌లిసి దిగిన ఫొటో ఇప్ప‌టికే నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo