టాలీవుడ్లో కొత్త సంప్రదాయాలు పుట్టుకొస్తున్నాయి. అప్పట్లో సినిమా ప్రమోషన్ అంటే ఆడియో ఫంక్షన్, ఆ తర్వాత ప్రెస్ మీట్లు ఏదో సాదాసీదాగా ప్రమోషన్ ఉండేది.ఇప్పుడలా కాదు..పోస్టర్ దగ్గర నుండి మొదలు పెడితే,లిరికిల్ సాంబ్ వీడియో, కవర్ సాంగ్,టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ వేడుక,ఇంటర్వ్యలు ఇలా పెద్ద హంగామానే చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో కవర్ సాంగ్‌తో సినిమాని ఎక్కువ ప్రమోషన్ చేయడం కామన్‌గా మారింది. సినిమాలో ఉండే పాటకు మ్యూజిక్ డైరెక్టర్ అతని టీం అంతా కలిసి హడావిడి చేస్తుండగా, అది ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అల వైకుంఠపురములో, ఆర్ఆర్ఆర్, తాజాగా భీమ్లా నాయక్ సినిమాలలో ఇలాంటి హంగామానే కనిపించింది
భీమ్లా నాయక్ కవర్ సాంగ్‌లో థమన్ యూనిట్‌తో పాటు జానపద గాయకుడు,సింగర్స్ కనిపించిన విషయం తెలిసిందే. మనం విన్న పాట సినిమాలో ఉన్నప్పటికీ ఆ విజువల్స్‌తో కాకుండా కొత్తగా ప్రజెంట్ చేశారు. దీని కోసం 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. సినిమా బడ్జెట్ కు ఇదంతా అదనమే. అయితే సినిమాకు బజ్ పెంచడానికి , ఫ్యాన్స్ దగ్గరకు సినిమాను తీసుకెళ్లడానికి ఈ మేరకు ఖర్చు చేయడం తప్పట్లేదు అంటున్నారు.