శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 09:02:48

సూప‌ర్ మ్యాన్‌గా బాల‌కృష్ణ‌..!

సూప‌ర్ మ్యాన్‌గా బాల‌కృష్ణ‌..!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శీను ద‌ర్శక‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రం మోనార్క్ అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. బాల‌కృష్ణ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా బీబీ 3 పేరుతో విడుద‌లైన టీజ‌ర్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చింది.  అయితే ఈ సినిమాలో బాల‌కృష్ణ‌ని కాస్త డిఫ‌రెంట్‌గా బోయ‌పాటి చూపించ‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో చిత్రానికి సూప‌ర్ మ్యాన్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

క‌థ‌కి సూప‌ర్ మ్యాన్ అనే టైటిల్ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని బోయ‌పాటి భావిస్తున్న నేప‌థ్యంలో ఇదే టైటిల్‌పై ఆస‌క్తి చూపుతున్నాడ‌ట‌. గతంలో ‘సూపర్ మ్యాన్‌’ అనే టైటిల్ తో ఎన్టీఆర్ ఓ  సినిమా కూడా చేశారు. ఇది సూప‌ర్ హిట్ అయింది. . ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోందని బోయపాటి ఇప్పటికే చెప్పారు. అతి త్వ‌ర‌లో చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ రానుంద‌ని స‌మాచారం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo