బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 20, 2020 , 12:52:57

తండ్రికి సింహాస‌నం చేయించిన మంచు ల‌క్ష్మీ

తండ్రికి సింహాస‌నం చేయించిన మంచు ల‌క్ష్మీ

న‌టిగా, వ్యాఖ్యాత‌గా, హోస్ట్‌గా రాణిస్తున్న మంచు ల‌క్ష్మీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సినిమా విష‌యాల‌నే కాక ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ని కూడా సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తూ ఉంటుంది. గురువారం( మార్చి 19) త‌న తండ్రి మోహన్ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ట్విట్ట‌ర్‌లో ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపిన ల‌క్ష్మీ.. బ‌ర్డ్‌డే గిఫ్ట్‌గా పెద్ద సింహాస‌నం చేయించి ఇచ్చింది. ఈ సింహాసనంపై క‌నిపిస్తున్న మూడు సింహాలు ఆయ‌న పిల్ల‌లు ( విష్ణు, మ‌నోజ్‌, ల‌క్ష్మీ) అని తెలిపింది. సింహాసనంపై మోహ‌న్ బాబు కూర్చొన‌గా, ఆయ‌న ప‌క్క‌న స‌తీమ‌ణి, ఇద్ద‌రు కుమారులు, ల‌క్ష్మీ కూర్చుంది. ఫ్యామిలీ ఫోటో మంచు అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కాగా, క‌రోనా కార‌ణంగా మోహ‌న్ బాబు త‌న 70వ జ‌న్మ‌దిన వేడుక‌ల‌కి దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే. 


logo