గురువారం 28 మే 2020
Cinema - May 16, 2020 , 14:20:49

అల వైకుంఠ‌పుర‌ములో ఖాతాలో మ‌రో రికార్డ్

అల వైకుంఠ‌పుర‌ములో ఖాతాలో మ‌రో రికార్డ్

అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆద‌రించింది. ముఖ్యంగా చిత్రం కోసం థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు శ్రోత‌ల‌ని మ‌రింత‌గా ఆకట్టుకున్నాయి. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా, బుట్టబొమ్మ‌, రాములో రాములా సాంగ్స్ రికార్డులు క్రియేట్ చేశాయి. ఒక్కో సాంగ్ వంద మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డులు సృష్టించింది. 

తాజాగా అల వైకుంఠ‌పుర‌ములో చిత్ర ఆల్బ‌మ్ వంద కోట్ల వ్యూస్ సాధించి యూ ట్యూబ్‌లో స‌రికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ విష‌యాన్ని గీతా ఆర్ట్స్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టిస్తూ.. మా ఆల్బ‌మ్‌ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధ‌న్య‌వాదాలు. న‌టీన‌టులు, గాయకులు, ర‌చ‌యిత‌లు ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు అని పేర్కొంది. కాగా, చిత్రంలోని బుట్ట‌బొమ్మ సాంగ్ దేశ‌విదేశాలకి చెందిన శ్రోత‌ల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకోవ‌డ‌మే కాక‌, వారితో స్టెప్పులేయించేలా చేసింది.


logo