సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. తన సినిమాల అప్డేట్స్ లేదంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ నెటిజన్స్‌ను అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మహేష్ ఫాలోవర్స్ సంఖ్య అధికంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం మహేష్ కోటీ 14 లక్షల ఫాలోవర్స్ ట్విట్టర్ లో కలిగి ఉండగా, మరే టాలీవుడ్ హీరో ఈ ఫీట్‌ని బీట్ చేయలేదు. అయితే ఇదే వేదికపై మహేష్ మరో రికార్డ్ సాధించాడు.
మహేష్ చేసిన ట్వీట్స్‌కి 100 కె లైక్స్ 24 సార్లు రాగా, ఆయనకు అగ్రస్థానం దక్కింది. తర్వాతి స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ (6) ఉన్నారు. అనంతరం రానా దగ్గుబాటి(3) రికార్డుకెక్కారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ (2 సార్లు) నితిన్ (2 సార్లు).. అల్లు అర్జున్ (2 సార్లు).. రామ్ చరణ్ .. నాని ఒక్కసారి మాత్రమే సాధించారు. కాగా, మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా పడింది.