కెరీర్లో వైవిధ్యమైన సినిమాలు చేసి అలరించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన 18వ సినిమాగా హర్యంక వంశస్థుడు మగధ రాజ్యాన్ని పాలించిన బింబిసారుడు జీవిత నేపథ్యంలో బింబిసార పేరుతో చిత్రాన్ని చేస్తున్నాడు. శుక్రవారం చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ఇందులో బార్బేరియన్ కింగ్ బింబిసారగా సరికొత్త లుక్‌లో కనిపించారు. యుద్ధంలో తన చేతిలో చనిపోయినవారి శవాల గుట్టపై కూర్చొని వైలెంటుగా కనిపించాడు కళ్యాణ్ రామ్.
సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడే వశిష్ఠ్. ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ ”బింబిసార” చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో క్యాథరిన్ ట్రెసా – సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ ,శ్రీనివాస్ రెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా చిత్రం నుండి కళ్యాణ్ రామ్‌కు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.