బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 12:02:22

కొత్త టైటిల్‌తో అక్ష‌య్ మూవీ పోస్ట‌ర్

కొత్త టైటిల్‌తో అక్ష‌య్ మూవీ పోస్ట‌ర్

త‌మిళ చిత్రం కాంచ‌నకు రీమేక్‌గా రాఘ‌వ లారెన్స్ తెర‌కెక్కించిన చిత్రం ల‌క్ష్మీ బాంబ్. అక్ష‌య్ కుమార్, కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ సినిమాని ఓటీటీ ద్వారా నవంబ‌ర్ 9న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్‌పై శ్రీరాజ్‌పుత్‌ కర్నీసేన అభ్యంతరం వ్యక్తంచేసింది. హిందు దేవతను, మత విశ్వాసాల్ని  కించపరిచేలా, అభ్యంతరకరంగా  టైటిల్‌ ఉందంటూ కర్నీ సేన చిత్రబృందానికి లీగల్‌ నోటీసులు జారీచేసింది. సినిమా పేరును మార్చాలంటూ డిమాండ్‌ చేసింది. 

సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో వివాదాల జోలికి పోవ‌డం ఇష్టం లేని చిత్ర బృందం ల‌క్ష్మీ బాంబ్ టైటిల్‌ని ల‌క్ష్మీగా మార్చింది. తాజాగా కొత్త టైటిల్‌తో పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో అక్ష‌య్ కుమార్.. కియారా వెనుక నిలుచొని చూస్తున్నారు. పోస్ట‌ర్ ఫ్యాన్స్‌ని ఆక్టట్టుకుంటుంది. కాగా, కొద్ది రోజుల క్రితం విడుద‌లైన మూవీ ట్రైలర్‌కు కూడా భారీ రెస్పాన్స్ రావ‌డంతో మూవీ మంచి విజ‌యం సాధిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.