బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 12:16:17

బాలయ్య సినిమాలో కొత్త హీరోయిన్‌

బాలయ్య సినిమాలో కొత్త హీరోయిన్‌

హైదరాబాద్‌ : బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో నటించే హీరోయిన్స్ గురించి రకరకాల పుకార్లు వినిపించాయి. తెలుగమ్మాయి అంజలితో పాటు మరో కీలక పాత్రలో శ్రియ సరన్ నటిస్తుందని వార్తులు వచ్చాయి. అమలాపాల్ పేరు కూడా తెరపైకొచ్చింది. అయితే ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో కొత్త హీరోయి‌న్‌ను పరిచయం చేయబోతున్నామని తెలిపారు.

అంతేకాదు సెలక్షన్‌ కూడా పూర్తయ్యాయని, ఒక అందమైన మోడల్ బాలకృష్ణ సరసన నటించనుందని సమాచారం. సింహ’ ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత బోయపాటి బాలయ్య కాంబినేషన్‌లో వచ్చే మూడో చిత్రం కావడంతో మంచి హిట్‌ సాధించాలని బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిత్రానికి ‘మోనార్క్’, ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాను మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo