శరణ్‌కుమార్ హీరోగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎం. సుధాకర్‌రెడ్డి నిర్మాత. శివ కేశన కుర్తి దర్శకుడు. హీరో మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను సూపర్‌స్టార్ కృష్ణ విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘పోస్టర్ ఆసక్తిని కలిగిస్తోంది. హీరోగా ఈ చిత్రం శరణ్‌కు చక్కటి శుభారాంభాన్ని అందించాలి’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘కృష్ణ కుటుంబం నుంచి వస్తోన్న శరణ్‌ను హీరోగా మా బ్యానర్ ద్వారా పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. యాక్షన్, లవ్, ఎంటర్టైనర్ చిత్రమిది. త్వరలో పూర్తి వివరాల్ని వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సెసిరోలియో.