శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 18:18:07

కొత్తమ్మాయి వేట‌లో కేజీఎఫ్ డైరెక్ట‌ర్..!

కొత్తమ్మాయి వేట‌లో కేజీఎఫ్ డైరెక్ట‌ర్..!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో తీస్తున్న చిత్రం స‌లార్. ఇటీవ‌లే ఈ ప్రాజెక్టు గ్రాండ్‌గా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. త్వ‌ర‌లోనే షూటింగ్ షురూ కానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవ‌రిని ఎంపిక చేస్తార‌న్న దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ కొన‌సాగుతూనే ఉంది. తాజాగా దీనికి సంబంధించిన మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. క‌థానుగుణంగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు కాకుండా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుంద‌ని ప్ర‌శాంత్‌నీల్ ఫిక్స‌య్యాడ‌ట‌.

స‌లార్ లో ఫీమేల్ లీడ్ రోల్ కు కొత్త‌మ్మాయి అయితేను పూర్తి న్యాయం చేయ‌గ‌లుగుతుంద‌ని ప్ర‌శాంత్‌నీల్ భావిస్తున్న‌ట్టు టాక్‌. స‌లార్ కోసం హాట్ లుక్స్ తో స్ట‌న్నింగ్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చే బ్యూటీ కోసం వేట కొన‌సాగిస్తున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌. కొంత‌మంది మోడ‌ల్స్ ను కూడా ప‌రిశీలిస్తున్నాడట‌. ఇప్ప‌టికే స్టార్ హీరోయిన్లు శ్ర‌ద్దాక‌పూర్, పూజాహెగ్డేతో రొమాన్స్ చేసిన ప్ర‌భాస్ ఇపుడు కొత్త భామ‌తో సంద‌డి చేస్తాడంటే అభిమానుల‌కు స‌రికొత్త అనుభూతినివ్వ‌డం ఖాయ‌మైన‌ట్టే. ప్ర‌భాస్ తో న‌టించే అవ‌కాశం కొట్టేసే ఆ ల‌క్కీగాళ్ ఎవ‌రో తెలియాలంటే మ‌రికొంతకాలం ఆగాల్సిందే.

ఇవి కూడా చ‌ద‌వండి..

సూర్య‌-బోయ‌పాటి కాంబోలో సినిమా..!

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్‌హాస‌న్ డిశ్చార్జ్‌


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo