శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 09:19:29

బిగ్ బాస్ హౌజ్‌లోకి మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవ‌రో తెలుసా?

బిగ్ బాస్ హౌజ్‌లోకి మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవ‌రో తెలుసా?

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ స‌క్సెస్ ఫుల్‌గా 55 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. శుక్ర‌వారం ఎపిసోడ్ చాలా ఎమోష‌న‌ల్‌గా సాగింది. అరియానా కోరిక మేర‌కు ఆమె కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన బిగ్ బాస్ .. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఓ వ్య‌క్తి వచ్చాడు. స్టోర్ రూంలో ఉన్న అత‌నిని ఇంటి స‌భ్యుల‌కు ప‌రిచయం చేయండ‌ని అన్నారు. దీంతో స్టోర్‌రూంలోకి వెళ్ళిన అరియానా.. చింపాంజీ బొమ్మ‌ని చూసి ఎమోష‌న‌ల్ అయింది. వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా వ‌చ్చింది ఈ బొమ్మే అని తెలుసుకుంది. బ‌య‌ట‌కు వెళ్ళి ఇంటి సభ్యుల‌కు ఇదే విష‌యాన్ని చెప్ప‌గా, మొద‌ట వారు న‌మ్మలేదు. త‌ర్వాత అరియానా ..బొమ్మ‌ను చూస్తూ క‌న్నీరు పెట్టుకుంది. అవినాష్ ఓదార్చాడు

ఇక కొద్ది సేప‌టి త‌ర్వాత సోహైల్‌, మెహ‌బూబ్ గేమ్‌లో ఎలా ముందుకు పోవాల‌నే విష‌యంపై ముచ్చ‌టించారు. అభిజిత్‌, మోనాల్‌లు త‌ప్పొప్పుల గురించి చ‌ర్చించుకున్నారు. అఖిల్ కూడా ఈ డిస్క‌షన్‌లో జాయిన్ అయ్యాడు. మేట‌ర్‌ని ఓ కొలిక్కి తెచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పటికీ, అది  సాధ్యం కాలేదు. నువ్ ఐ లైక్ యూ చెప్పావ్.. ఆ తరువాత నన్ను మ్యానిప్యులేటర్ అన్నావ్.. నాగార్జున ముందు ఇద్దరిదీ తప్పు అని చెప్పావ్ అంటూ పాత గొడ‌వ‌ల గురించి ప్ర‌స్తావించాడు అభిజిత్‌. 

అభిజిత్‌, మోనాల్ డిస్క‌ష‌న్ మ‌ధ్య దూరి అఖిల్ ..నువ్వు ఆ స‌మ‌యంలో చెప్పిన టోన్ హై పిచ్‌లో ఉంది. ఇలా చెప్తే ఆమె అర్ధం చేసుకునేదేమో అని అన్నాడు.  మోనాల్‌కి అలా అర్థమైతే నేను ఆమెకు క్షమాపణ చెప్పాలని లేదు.. నా గురించి నేను మాట్లాడుకోవడానికి నాకు హక్కు ఉంది. ఆమె హర్ట్ అయ్యిందంటే నేను హర్ట్ చేయలేదు.. కానీ మోనాల్ వల్ల నేను హర్ట్ అయ్యా.. నేను నీ గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు.. ఇద్దరం ప్రశాతంగా ఉందాం అంటూ కాసేపు హాట్ హాట్ డిస్క‌ష‌న్ జ‌రిగింది.