ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 09, 2020 , 16:04:25

అప్సరా రాణిపై ట్వీట్స్ ఎఫెక్ట్..వర్మపై ట్రోల్స్

అప్సరా రాణిపై ట్వీట్స్ ఎఫెక్ట్..వర్మపై ట్రోల్స్

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషన్ అవుతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో..ఏ సినిమా రిలీజ్ చేస్తాడో వర్మకే తెలుసు. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా సిరీస్ లతో ప్రేక్షకులను పలుకరిస్తున్న వర్మ..ఇపుడు లేటెస్ట్ గా థ్రిల్లర్ మూవీతో వస్తున్నాడు. ఒడిశాకు చెందిన అప్సరా రాణిని ఈ చిత్రంతో అందరికీ పరిచయం చేస్తు్న్నాడు వర్మ. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు కావాల్సిన టాలెంట్ ఒడిశాలో ఉందని అస్సలు అనుకోలేదని వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

అప్సరా రాణి ఫొటో గ్యాలరీ..

అప్సరా రాణిని కలిసే కంటే ముందు1999 సూపర్ సైక్లోన్ తర్వాత నేను ఒడిశా గురించి ఎప్పుడూ వినలేదు. కానీ అప్సరా రాణిని కలిశాక ఒడిశా అన్ని రకాల తుఫాన్లను (హరికేన్స్) సృష్టిస్తుందని తెలుసుకున్నా. ఇలాంటి అందమైనవాళ్లు ఉండటం గొప్ప విషయం. ఒడిశాకు ఎక్కువ శక్తి వచ్చింది అంటూ ఆర్జీవీ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో ఆర్జీవీ ట్వీట్స్ నెటిజన్లు ట్రోల్స్ చేయడం మొదలెట్టారు.

ఒడిశా వ్యక్తులు, వేరే ప్రాంతాలకు చెందినవారు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తులు (ఆర్జీవీ) వారి విజయం వల్ల ఎప్పుడూ గాల్లోకి తేలిపోతుంటారు. వారి చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. ఒడిశాకు చెందిన 3వ తరగతి విద్యార్థి కూడా వర్మ కంటే ఉత్తమమైన ఐక్యూ లెవల్స్ ఉంటాయని ఛాలెంజ్ చేస్తున్నా. ఆర్జీవీ నుంచి జ్ఞానాన్ని ఆశించకండి అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. డియర్ వర్మ..ఒడిశాపై చేసిన ట్వీట్ తో నీ అజ్ఞానాన్ని ప్రజలకు తెలియజేశావు అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. జగన్నాథుడు కొలువుదీరిన స్థలం ఒడిశా. కామపూరితమైన దృష్టికి ఒడిశాలో స్థానం లేదని మరో నెటిజన్ తీవ్రంగా స్పందించాడు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo