శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 15, 2021 , 18:09:53

కృతిస‌న‌న్‌ క‌విత్వానికి నెటిజ‌న్లు ఫిదా

కృతిస‌న‌న్‌ క‌విత్వానికి నెటిజ‌న్లు ఫిదా

వ‌న్..నేనొక్క‌డినే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుకరించింది బాలీవుడ్ భామ కృతిస‌న‌న్‌. ఈ భామ ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ తో క‌లిసి బ‌చ్చ‌న్ పాండే చిత్రంలో న‌టిస్తోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ అప్ప‌డ‌పుడు హర్ట్ ట‌చింగ్ క‌విత్వాల‌తో అంద‌రినీ కొత్త ప్ర‌పంచ‌లోకి తీసుకెళ్తుంటుంది. తాజాగా కృతిస‌నన్ పెట్టిన క‌విత్వానికి అంద‌రూ ఫిదా అవుతున్నారు. గార్జియ‌స్ లుక్‌లో త‌న కండ్ల‌ను హైలెట్ చేస్తూ ఉన్న ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కృతిస‌నన్‌..

'ఆమె కండ్లు లోతైన‌వి, నిజాయితీతో కూడుకున్న‌వి..

అవి ఎప్పుడూ మార‌వు..

అలాంటి ప్రేమ కోసం ఆమె వేచి చూస్తోంది..' 

అంటూ కృతిస‌న‌న్ పెట్టిన క‌విత్వానికి నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు. ఆ కండ్ల గురించి మీరు చాలా బాగా రాశారు..నేనెప్పుడూ మీ క‌విత్వానికి అభిమానిని అని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. ద‌య‌చేసి..ఇంకా ఇంకా రాయు..ల‌వ్ యూ అంటూ మ‌రో వ్య‌క్తి కామెంట్ పోస్ట్ చేశాడు. క్యూటీ అంటూ మ‌రొక‌రు..ప‌దాలు ఇన్ షా అల్లా అంటూ మ‌రొక‌రు కామెంట్ల మీద కామెంట్లు పెట్టారు. కృతి స‌న‌న్ తాజా క‌విత్వం ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 

ఇవి కూడా చ‌ద‌వండి

ఆర్మీ ఆఫీస‌ర్ గా సోనూసూద్..మ్యూజిక్ వీడియో

పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌భాస్ 'స‌లార్' షురూ

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo