శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 20, 2021 , 19:47:09

యాంకర్స్ రవి, సుమ టాలెంట్‌కు ఫ్యాన్స్ ఫిదా

యాంకర్స్ రవి, సుమ టాలెంట్‌కు ఫ్యాన్స్ ఫిదా

తెలుగు ఇండస్ట్రీలో యాంకర్స్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు సుమ కనకాల, ఆ తర్వాత ప్రదీప్, రవి. వీళ్లే బుల్లితెరపై మోస్ట్ వాంటెడ్ యాంకర్స్‌. అనసూయ భరద్వాజ్, రష్మిగౌతమ్ ఉన్నా కూడా వాళ్లు సినిమాలతో కూడా బిజీగా ఉంటారు. అందుకే సుమ, రవి మాత్రమే ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారు. వీళ్ళకు యాంకరింగ్ తప్ప మరేం తెలియదని అంతా అనుకుంటారు. కానీ వాళ్లకు యాంకరింగ్ తో పాటు మరో టాలెంట్ కూడా ఉంది. దాన్ని ఇప్పుడు తమ షోలో చూపించారు ఈ ఇద్దరు యాంకర్స్. వీళ్లు చేసిన పనికి అంతా ఫిదా అయిపోతున్నారు. నెటిజన్స్ కూడా సూపర్ అంటూ పొగిడేస్తున్నారు. అంతగా ఏం చేసారబ్బా అనుకుంటున్నారా..? యాంకరింగ్ తో పాటు సింగింగ్ లో కూడా టాలెంట్ చూపిస్తున్నారు. సుమ, రవి కలిసి ప్రస్తుతం బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే కార్యక్రమం చేస్తున్నారు. జీ తెలుగులో వచ్చే ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎలాంటి టాలెంట్ ఉన్నా కూడా ఇక్కడ వచ్చి ప్రదర్శించడమే ఈ షో కాన్సెప్ట్. 

సింపుల్ గా చెప్పాలంటే ఇండియా గాట్ టాలెంట్ మాదిరి అన్నమాట. ఈ షోలో దేశంలోని నలుమూలల నుంచి ఉన్న కళాకారులు, టాలెంటెడ్ పీపుల్ వచ్చి ఇక్కడ తమ ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళతో పాటు రవి, సుమ కూడా తమ టాలెంట్ చూపించారు. ఇన్నాళ్ళూ కేవలం యాంకరింగ్ తోనే ఆకట్టుకున్న వాళ్లు ఇప్పుడు సింగింగ్ టాలెంట్ కూడా చూపించారు. సుమ అంటే ఇదివరకే పాడటం విన్నాం.. ఈమె గతంలో సాయి ధరమ్ తేజ్ విన్నర్ సినిమాలో సూయ సూయ అంటూ పాడేసింది. తమన్ ఈమెతో పాడించాడు. అందులో తన తోటి యాంకర్ అనసూయ భరద్వాజ్ నటించింది. కానీ రవి మాత్రం పాడటం ఎప్పుడూ వినలేదు. అలాంటిది ఇప్పుడు ఈయన సువ్వి సువ్వి అంటూ స్టేజీపై ఆలపించాడు.. మధ్యలో ఆలాప్ కూడా అదరగొట్టాడు. సువ్వి సువ్వి సువ్వాలమ్మా అంటూ వీళ్లు పాడిన పాటకు ఇప్పుడు నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఈ పాట కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

షారుక్ ఖాన్ ' ప‌ఠాన్' సెట్స్ లో గొడ‌వ జ‌రిగిందా..?

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

నన్ను ఫాలో కావొద్దు..రియాచ‌క్ర‌వ‌ర్తి వీడియో వైర‌ల్‌

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo