శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 26, 2021 , 17:01:02

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..?  నెటిజ‌న్ల కామెంట్స్

టాలీవుడ్ యాక్ట‌ర్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌స్తుతం మ‌ల‌యాళ రీమేక్ అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌కల్యాణ్ బుల్లెట్‌పై సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న షాట్‌తోపాటు త్రివిక్ర‌మ్ కూడా స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా క‌నిపిస్తున్న ఓ ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ వీడియోకు అద్బుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. సాగ‌ర్ చంద్ర ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ కాగా..త్రివిక్ర‌మ్ మాట‌లు అందిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే టాక్ ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా మేక‌ర్స్ రిలీజ్ చేసిన వీడియోపై సోష‌ల్ మీడియాలో  నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌ధానంగా త్రివిక్ర‌మ్ నే టార్గెట్ చేస్తూ ఈ చాట్ సాగ‌డం గ‌మ‌నార్హం. ఓ నెటిజ‌న్ ఈ వీడియోపై స్పందిస్తూ..ఇది ఓ కుట్ర. ఒక‌వేళ ఈ సినిమా హిట్ట‌యితే త్రివిక్ర‌మ్ సెట్స్ లోని క‌నిపించాడు కాబట్టి క్రెడిట్ ఆయ‌నకు వెళ్లిపోతుంది. ఒక‌వేళ ఫెయిల్ అయితే ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ సాగ‌ర్ చంద్ర‌కు వెళ్తుంద‌ని కామెంట్ పెట్టాడు.

సినిమాపై అటెన్ష‌న్ ను పెంచేందుకు తొలి రోజు త్రివిక్ర‌మ్ అతిథిలా తీసుకొచ్చిన‌ట్టున్నారు. ఆయ‌న అన్ని షెడ్యూల్స్ లో ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ త్రివిక్ర‌మ్ లుక్ గెస్ట్‌లాగా కాకుండా డైరెక్ట‌ర్ గానే క‌నిపిస్తుంది. ప‌వ‌న్ తో లొకేష‌న్‌లో స్లో మోష‌న్ లో న‌డుచుకుంటూ వస్తున్న షాట్‌తో త్రివిక్ర‌మ్ ఏం కోరుకుంటున్నాడో చూపిస్తుంది. కొద్దిగా ఓవ‌ర్ యాక్ష‌న్ అంటూ మ‌రో నెటిజ‌న్  పోస్ట్ పెట్టాడు. మ‌రో నెటిజ‌న్ స్పందిస్తూ..ఒక‌సారి త్రివిక్ర‌మ్ సెట్స్ లో క‌నిపించాడంటే సాగ‌ర్ చంద్ర ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ అని ఎవ‌రు న‌మ్ముతారు. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో సాగ‌ర్ చంద్ర అసోసియేట్‌గా ప‌నిచేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. ఎన్టీఆర్ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను డైరెక్ట్ చేసే వ‌ర‌కు త్రివిక్ర‌మ్ ఎందుకు వెయిట్ చేయ‌డం లేదు. ఈ దురాశ ఎందుకు..? అని కామెంట్ పెట్టాడు. 

ఏది ఏమైనా రైట‌ర్ గా కెరీర్ ప్రారంభించిన త్రివిక్ర‌మ్ ఆ త‌ర్వాత డైరెక్ట‌ర్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ సొంతం చేసుకుని మాట‌ల మాంత్రికుడు అని పిలుచుకునే స్థాయికి ఎదిగాడ‌నేది ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. నెటిజ‌న్ల టాక్ ఎలా ఉన్నా రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ గా త‌న మార్కును చూపించుకుంటూ వెళ్తాన‌డంలో ఎలాంటి సందేహం లేదు.


ప‌వ‌న్ ఇంట్ర‌డక్ష‌న్ వీడియోపై ఓ లుక్కేయండి మ‌రి


ఇవి కూడా చ‌ద‌వండి..

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్‌డే .. ఖిలాడి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

కూలీ నెం 1 సాంగ్ కు శ్ర‌ద్దాదాస్ డ్యాన్స్..వీడియో

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo