మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 12:54:31

ప‌వ‌న్ కల్యాణ్ స్టిల్ పై కామెడీ టాక్‌..!

ప‌వ‌న్ కల్యాణ్ స్టిల్ పై కామెడీ టాక్‌..!

సెప్టెంబ‌ర్ 2న‌ టాలీవుడ్ యాక్ట‌ర్, జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజున అభిమానులు, సెల‌బ్రిటీలు పెద్ద సంఖ్య‌లో శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. త‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పిన ప్ర‌తీ ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు ప‌వ‌న్‌. పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ల్ల‌టి గ‌డ్డం, తెలుపు రంగు లుంగీ, చొక్కా ధ‌రించిన ఫొటోలు కొన్ని సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. ఆ ఫొటోల్లో ఓ స్టిల్ పై ఇపుడు నెటిజ‌న్ల చూపు ప‌డింది. ప‌వ‌న్ టేబుల్ ముందు కూర్చొని పేప‌ర్స్ తిరగేస్తుండ‌‌గా..ఆ టేబుల్ మీద పేప‌ర్ బండిల్స్ ప్యాక్స్ ఉన్నాయి. వీటిపై నెటిజ‌న్లు కామెడీ ట‌చ్ ఇస్తూ త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

ప‌వ‌న్ ముందున్న ఫైల్స్ కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ అని కొంద‌రు అంటే..కాదు కాదు రాజ‌కీయ సంబంధ ద‌స్త్రాలు అని మ‌రికొంద‌రు, లేదు క‌రెంట్ అఫైర్స్ కు సంబంధించిన ఫైల్స్ అంటూ ఫ‌న్నీ డిష్క‌ష‌న్స్ చేసుకుంటున్నారు. అవ‌న్నీ ఖాళీ ఫైళ్ల‌ని కొంత‌మంది నెటిజ‌న్లు సెటైర్స్ వేస్తున్నారు. మొత్తానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాస్త సీరియ‌స్ లుక్ లో క‌నిపిస్తున్నా ఫొటోపై నెటిజ‌న్లు కామెడీ ట‌చ్ ఇస్తూ స‌ర‌దా కామెంట్లు పెడుతున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo