శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 12:29:02

ముంబైలో ప‌వ‌ర్ క‌ట్‌.. .నెటిజ‌న్స్ ఫ‌న్నీ మీమ్స్

ముంబైలో ప‌వ‌ర్ క‌ట్‌.. .నెటిజ‌న్స్ ఫ‌న్నీ మీమ్స్

గ్రిడ్ ఫెయిల్యూర్ కార‌ణంగా ముంబై న‌గ‌రంలో విద్యుత్ అంత‌రాయం ఏర్ప‌డింది. ఈ రోజు ఉద‌యం నుండి ముంబైలో క‌రెంట్ లేక‌పోవ‌డంతో న‌గ‌రం మొత్తం స్తంభించింది. అన్ని ప‌నులు ఎక్క‌డికక్క‌డ ఆగిపోయాయి. ఈ రోజు జర‌గాల్సిన ప‌రీక్ష‌లు కూడా వాయిదాప‌డ్డాయి.  అయితే మ‌రి కొద్ది గంట‌ల‌లో విద్యుత్‌ని పున‌రుద్ధ‌రిస్తామ‌ని ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ చెబుతుంది.

విద్యుత్తు అంతరాయం ఏర్ప‌డ‌డంతో నెటిజన్లు బాలీవుడ్ పాట‌లు, ఫ‌న్నీ డైలాగ్స్‌తో మీమ్స్  క్రియేట్ చేసి  సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప‌వర్ క‌ట్ గురించి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న మీమ్స్ అంద‌రిని ఆకట్టుకుంటున్నాయి. ప‌వ‌ర్ క‌ట్ వ‌ల‌న వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే వారికి పండ‌గే అని కొంద‌రు మీమ్స్ చేస్తుంటే మ‌రి కొంద‌రు బాహుబ‌లి సినిమాలోని ప్ర‌భాస్, స‌త్యరాజ్‌ల స‌న్నివేశానికి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. న‌గ‌రంలో దండోరా వేయించు మామ అంటూ కామెంట్స్ రాస్తున్నారు.