బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 10, 2020 , 16:44:07

రోహిత్‌శెట్టి స్టైల్ లో వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌..నెటిజన్ల ట్వీట్స్‌

రోహిత్‌శెట్టి స్టైల్ లో వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌..నెటిజన్ల ట్వీట్స్‌

కాన్పూర్‌లో ఎనిమిది మంది పోలీసుల చావుకు కారణమైన మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే వార్త కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం నుంచి నిందితుడు వికాస్‌ దూబే యూపీ పోలీసుల కండ్లుగప్పి తిరుగుతున్నాడు. వారం తర్వాత మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌ జిల్లాలో పోలీసలు వికాస్‌దూబేను అదుపులోకి తీసుకున్నారు. యూపీ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో వికాస్‌దూబే మృతిచెందాడు.  

ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరును పరిశీలిస్తే..కాన్పూర్‌ పోలీసులు వికాస్‌దూబేను ఉజ్జెయిన్‌ నుంచి కాన్వాయ్‌లో తీసుకొస్తున్నారు. కాన్పూర్‌కు వచ్చే మార్గంలో వికాస్‌ దూబేను తీసుకెళ్తున్న కారు బోల్తాపడింది. ఈ ఘటనలో పోలీసులు, వికాస్‌దూబేకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన వికాస్‌ దూబే గాయపడ్డ పోలీస్‌ దగ్గర నుంచి తుపాకి లాక్కుని.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు వికాస్‌దూబేను చుట్టుముట్టారు. లొంగిపోవాలని కోరగా..వికాస్‌ దూబే మాత్రం కాల్పులు షురూ చేశాడు. ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా వికాస్‌దూబేపై కాల్పులు జరిపి ఎన్‌కౌంటర్‌ చేశారు. 

అయితే వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌శెట్టి వార్తల్లో నిలుస్తున్నాడు. అదేంటీ.. వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌కు రోహిత్‌శెట్టికి సంబంధమేంటి అనుకుంటున్నారా..?. కాన్పూర్‌ పోలీసులు రోహిత్‌ శెట్టి సినిమాల్లోని యాక్షన్‌ సీన్లను కాపీ కొట్టి..రోహిత్‌ శెట్టి  స్టైల్లో ఎన్‌కౌంటర్‌ చేశారని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కారును నడిపించి బోల్తా కొట్టించిన డ్రైవర్‌కు హాట్సాఫ్‌. రోహిత్‌శెట్టి తీయనున్న కొత్త చిత్రంలో కారు డ్రైవర్‌కు స్టంట్‌మ్యాన్‌గా అవకాశమివ్వాలి. అంతేకాదు రోహిత్‌శెట్టి కాన్పూర్‌ పోలీసుల నుంచి సింగం 3 కథను కూడా రెడీ చేసుకోవచ్చని ఓ ట్విటర్‌ యూజర్‌ కామెంట్‌ పెట్టాడు. వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ సీన్‌ను రోహిత్‌శెట్టి డైరెక్ట్‌ చేశారా..? అంటూ మరో యూజర్‌ కామెంట్‌ పోస్ట్‌ చేశాడు. వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ను రోహిత్‌శెట్టి సినిమాలతో పోలుస్తూ...నెటిజన్లు పెట్టిన ఫొటోలపై ఓ లుక్కేయండి మరి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo