గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 26, 2020 , 09:47:19

బాలులో ఎంత నిరాడంబ‌ర‌త్వం..!

బాలులో ఎంత నిరాడంబ‌ర‌త్వం..!

సంగీత ప్ర‌పంచంలో రారాజుగా వెలిగిన గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం శ‌కం ముగిసింది. ఆయ‌న మ‌ర‌ణం యావ‌త్ ప్ర‌పంచాన్ని శోక‌సంద్రంలో ముంచింది. ఎంతో అణుకువ‌, నిరాంబ‌ర‌త‌, క్ర‌మశిక్ష‌ణ బాలు సొంతం. బాలులో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ చెప్పాలంటే ఒక‌టి కాదు అనేకం. ఎంత ఎదిగినా కూడా ప్ర‌తి ఒక్క‌రికి ఆయ‌న ఇచ్చే మ‌ర్యాద అంతా ఇంతా కాదు.  ఎస్పీ బాలు వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఆయ‌న‌తో సాన్నిహిత్యంగా ఉన్న వారికి చాలా తెలుస్తుంది.

బాలు మ‌ర‌ణించిన త‌ర్వాత ఆయ‌న‌ నిరాడంబరత్వం, గొప్పదనం గురించి చెప్పే ఎన్నో పొస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా బాలు ఓ సారి  కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలను సందర్శించారు. పంబా నుండి శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి డోలీలో వెళ్లేందుకు సిద్ద‌మ‌య్యాడు. అయితే ఆ డోలీ ఎక్కే ముందుకు అది మోసే కూలీల‌కు దండం పెట్టారు. దైవంగా భావించి ఆ న‌లుగురికి బాలు న‌మ‌స్క‌రించ‌డం ఆయ‌న‌లో మాన‌వ‌త్వం, నిరాడంబ‌ర‌త‌కు అద్ధం ప‌ట్టాయి. ఆయ‌న వ్యక్తిత్వాన్ని ఎంత‌గానో  కొనియాడుతున్నారు. బాలు త్వరగా కోలుకొని తిరిగి రావాలని శబరిమల ఆలయంలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే.

బాలు నిరాడంబ‌ర‌త‌కు మ‌రో ఉదాహ‌ర‌ణ‌..2015లో గ‌జ‌ల్ శ్రీనివాస్ కుమార్తె గాన ఆరంగేట్ర కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు బాల సుబ్ర‌హ్మ‌ణ్యం. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లి పాదాభివందనం చేసేందుకు ఆ అమ్మాయి ప్ర‌య‌త్నించ‌గా.. అమ్మా వ‌ద్దు త‌ల్లి అంటూ కుర్చీలో వంగి పాదాల‌కు త‌న చేతుల‌ని అడ్డుపెట్టుకొని ప్ర‌తి న‌మ‌స్కారం చేసి త‌న నిరాడంబ‌ర‌త‌ను చాటుకున్నారు. ఇలా ఒక‌టి రెండు కాదు బాలులోని నిరాడంబ‌ర‌త‌కు సంబంధించిన ఎన్నో సంఘ‌ట‌నలు ఉన్నాయి. 
logo