ఆదివారం 31 మే 2020
Cinema - May 08, 2020 , 07:54:55

పాక్ జ‌ర్న‌లిస్ట్‌కి న‌గ్మా మ‌ద్దతు.. గ‌రం అయిన నెటిజ‌న్స్

పాక్ జ‌ర్న‌లిస్ట్‌కి న‌గ్మా మ‌ద్దతు.. గ‌రం అయిన నెటిజ‌న్స్

ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలిగిన న‌గ్మా ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ట్ పార్టీ రాజ‌కీయాల‌లోచురుకుగా పాల్గొంటున్న న‌గ్మా ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైంది. అయితే తాజాగా ఓ టీవీ ఛానెల్ చ‌ర్చ‌లో పాల్గొన్న ఈ అమ్మ‌డు పాక్ జ‌ర్న‌లిస్ట్‌కి మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో విమర్శ‌ల పాలైంది. 

భారతీయులంతా పాక్‌ని ఎండ‌గ‌డుతూ ఉంటే న‌గ్మా మాత్రం పాక్ జ‌ర్న‌లిస్ట్‌ని స‌పోర్ట్ చేసి మాట్లాడ‌డంతో నెటిజ‌న్స్ ఆమెపై చిర్రుబుర్రులాడారు.'నగ్మా స్టాండ్స్ విత్ పాకిస్తాన్' పేరుతో హ్యాష్ ట్యాగ్ పేరుతో తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఒకానొక టైంలో ఆ  హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది.

వివ‌రాల‌లోకి వెళితే న‌గ్మా తాజాగా ..భారత దేశంలో ముస్లింల సమస్యలు భారత్-పాక్ సంబంధాలపై హిందీ చానెల్ చర్చలో  పాల్గొంది. ఇదే చర్చలో 'తారిక్ పీర్జాదా' అనే పాకిస్తాన్ జర్నలిస్టు కూడా పాల్గొని భారత్ పై విషం కక్కాడు. దీంతో టీవీ చానెల్ ప్రతినిధి కూడా పాకిస్తాన్ జర్నలిస్టుపై మండిపడ్డారు.కాని  నగ్మా మాత్రం  సదురు పాకిస్తాన్ జర్నలిస్టుకు మద్దతు తెలపడంతో పాటు, చర్చకు పిలిచి  అవమానిస్తారా అంటూ చానెల్ ప్రతినిధిని నిలదీశారు. ఈ మేరకు ట్విట్టర్ లోనూ ఆమె పాక్ జర్నలిస్టుకు మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేశారు. దీంతో న‌గ్మాపై నెటిజ‌న్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. 


logo