బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 27, 2020 , 08:50:01

సీన్ రివ‌ర్స్‌.. బిగ్ బీపై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం

సీన్ రివ‌ర్స్‌.. బిగ్ బీపై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అమితాబ్ బ‌చ్చ‌న్ రీసెంట్‌గా త‌న ఇంట్లో గ‌బ్బిలం రావ‌డంపై ఓ ట్వీట్ చేశారు. మా ఇంట్లోకి గ‌బ్బిలం వ‌చ్చింది. అదీ కూడా మూడ‌వ అంత‌స్తులోని నా డెన్‌కి. దాన్ని వెళ్ల‌గొట్ట‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాం. క‌రోనా నన్ను విడిచి పెట్ట‌డం లేదంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కొంద‌రు మీకేం భ‌యం లేదు స‌ర్. మేమున్నాం ధైర్యంగా ఉండ‌డ‌ని భ‌రోసా ఇచ్చారు.

కొంద‌రు నెటిజ‌న్స్ మాత్రం అమితాబ్ ట్వీట్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు . గ‌బ్బిలాలు మ‌న‌కి హాని క‌లిగించేవి కావు. పురుగుల‌ని కంట్రోల్ చేసే జీవులు అవి. వాటిని త‌ప్పు ప‌ట్టొద్దు. ఇంత పేరు ప్ర‌ఖ్యాత‌లు ఉన్న మీరు ఇలా మాట్లాడ‌డం స‌రికాదు అంటూ అమితాబ్‌పై కొంద‌రు ఫైర్ అయ్యారు. ఏదో ఫన్నీగా అమితాబ్ ఈ ట్వీట్ చేయ‌గా సీన్ రివ‌ర్స్  అయిందని ఆయ‌న అభిమానులు భావిస్తున్నారు.


logo