గురువారం 21 జనవరి 2021
Cinema - Jan 14, 2021 , 14:40:19

ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లో 70 ఒరిజిన‌ల్స్ విడుద‌ల‌..!

ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లో 70 ఒరిజిన‌ల్స్ విడుద‌ల‌..!

ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెటిఫ్లిక్స్ లో 2021లో త‌న హ‌వా కొన‌సాగించేందుకు సిద్ద‌మైంది. ఈ ఏడాది ఏకంగా 70 ఒరిజిన‌ల్స్ మూవీస్  విడుద‌ల చేయనుంది. 2021లో 70 ఒరిజిన‌ల్ మూవీస్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నెట్ ఫ్లిక్స్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ డ్వానే జాన్స‌న్ , ర్యాన్ రేనాల్డ్స్ , గాల్ గాడ‌ట్ న‌టించిన యాక్ష‌న్ మూవీ రెడ్ నోటీస్ చిత్రాన్ని ఈ ఏడాదే విడుద‌ల చేసేందుకు రెడీ అవుతోంది.

దీంతోపాటు హిట్ రొమాంటిక్ కామెడీస్ The Kissing Booth,  To All the Boys I’ve Loved Before చిత్రాల‌ను కూడా లైన్ లో పెట్టింది. అదేవిధంగా హ‌ల్లే బెర్రీ డైరెక్టోరియ‌ల్ డెబ్యూట్ చిత్రం కూడా ప్రేక్ష‌కుల‌కు అందించ‌నుంది. ఈ చిత్రం లియోనార్డో డికాప్రియో, జెన్నిఫ‌ర్ లారెన్స్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించిన 2020లో ఇంటికే ప‌రిమిత‌మైన ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని అందించ‌డ‌మే ల‌క్ష్యంగా పెద్ద చిత్రాల‌నే విడుద‌ల చేసి..ప్ర‌త్యర్థి ఆన్ లైన్ లైవ్ స్ట్రీమింగ్ కంపెనీల‌కు గ‌ట్టిపోటీనే ఇచ్చింది.

ఇక ఈ ఏడాది కూడా యాక్ష‌న్‌, హార్ర‌ర్, కామెడీ, థ్రిల్ల‌ర్, డ్రామా, వెస్ట‌ర్న్, యానిమేష‌న్ ఇలా అన్నిజోన‌ర్స్ లో తీసిన చిత్రాల‌ను ప్రేక్ష‌కులకు అందించేందుకు రెడీ అవుతోంది.

ఇవి కూడా చ‌ద‌వండి

ఒకే ఫ్రేమ్‌లో 'వ‌రుడు కావ‌లెను' ఫ్యామిలీ

'వ‌రుడు కావాలి' అంటున్న రీతూవ‌ర్మ‌..ఫ‌స్ట్ గ్లింప్స్ వీడియో

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

బాలీవుడ్ సినిమాపై రామ్ క్లారిటీ..!

జాన్వీ క‌పూర్ షూటింగ్‌ను అడ్డుకున్న రైతులు


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo