సూపర్ హిట్ మూవీ బాహుబలి ప్రాంచైజీలో ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌పాం నెట్‌ఫ్లిక్స్ ప్రీక్వెల్ సిరీస్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. (The Rise of Shivagami) పుస్తకం ఆధారంగా బాహుబలి..బి ఫోర్ బిగినింగ్ టైటిల్‌తో సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే సిరీస్ ను గతంలోనే కొంత షూట్ చేసిన నెట్‌ఫ్లిక్స్ అవుట్ పుట్ సరిగా రాకపోవడంతో మళ్లీ ఈ ప్రాజెక్టును రీ షూట్ చేస్తోంది. కొత్త నటీనటులతో ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తోంది. పంజాబీ నటి వామికా గబ్బి (Wamiqa Gabbi) శివగామి (Shivagami) గా లీడ్ రోల్ చేస్తుండగా..రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే షురూ కానుంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం శివగామి చుట్టూ చాలా యాక్షన్ సన్నివేశాలుంటాయట. అందుకోసం వామికా వివిధ యుద్ద నైపుణ్యాలకు సంబంధించిన శిక్షణ తీసుకుంటోంది. తాజాగా కత్తిసాము ఫైటింగ్ శిక్షణకు సంబంధించిన వీడియోను వామికా గబ్బి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పంజాబీ డ్రెస్ లో ఉన్న వామికా నడుముకు చున్నీ బిగించి కత్తిపట్టుకుని తన ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. ఈ వీడియోలో వామికా ప్రొఫెషనల్ ట్రైనరా అన్నట్టుగా కనిపిస్తోంది.
ఈ సిరీస్ లో నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలోనే వెల్లడిం కానున్నాయి. పంజాబ్ కు చెందిన వామికా హిందీ, పంజాబీ, మలయాళ చిత్రాల్లో ఎక్కువగా నటించింది. తెలుగులో భలే మంచి రోజు సినిమాలో మెరిసింది. ఈ భామ రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రను మించేలా తన పాత్రలో ఒదిగిపోనుందని తాజా వీడియో చూస్తే తెలిసిపోతుంది.
ఇవి కూడా చదవండి..
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్