మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 21, 2020 , 12:10:06

క‌రోనా రిలీఫ్ ఫండ్‌కి నెట్‌ఫ్లిక్స్ భారీ విరాళం

క‌రోనా రిలీఫ్ ఫండ్‌కి నెట్‌ఫ్లిక్స్ భారీ విరాళం

కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచం మొత్తం స్తంభించే ప‌రిస్తితికి వ‌చ్చింది. ప‌రిశ్ర‌మ‌లు, స్కూల్స్‌, కాలేజెస్‌, థియేట‌ర్స్‌, షూటింగ్‌లు ఇలా ఒక‌టేంటి అనేక బిజినెస్‌లపై క‌రోనా భారీ దెబ్బ ప‌డింది. ఊహించని ప‌రిణామంతో దేశవ్యాప్తంగా ఉన్న‌ వేలాది మంది కార్మికులు నిరుద్యోగులుగా మారారు. ఈ క్ర‌మంలో స్ట్రీమింగ్ దిగ్గ‌జం రోజువారి వేత‌నం పొందే కార్మికుల‌కి వంద మిలియ‌న్ డాలర్లు విరాళంగా ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.    

నెట్‌ఫ్లిక్స్ ఎదుగుద‌ల‌కి స‌రైన స‌మ‌యంలో అండ‌గా నిలిచిన యూజ‌ర్స్ కోసం వంద మిలియ‌న్ డాల‌ర్ల‌ని రిలీఫ్ ఫండ్‌గా ఇస్తున్నాం అని నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. అలానే యునైటెడ్ స్టేట్స్‌,  లాభాపేక్షలేని వాటితో పాటు అపారమైన ఉత్పత్తి స్థావరం ఉన్న దేశాలలో పని చేయని తారాగణం మరియు సిబ్బందికి , అత్యవసర ఉపశమనం అందించే సంస్థలకు 15 మిలియన్ల డాల‌ర్ల‌ నిధి పంపిణీ చేయబడుతుందని వారు ప్రకటించారు.


logo