శనివారం 30 మే 2020
Cinema - May 09, 2020 , 22:27:48

రెమ్యునరేషన్‌ కష్టాలు

రెమ్యునరేషన్‌ కష్టాలు

కరోనా ఎఫెక్ట్‌ పరోక్షంగా సినీతారల పారితోషికాలపై కూడా పడబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అగ్ర కథానాయికలు భవిష్యత్తులో తమ రెమ్యునరేషన్స్‌లో కోత విధించుకోక తప్పదనే మాట వినిపిస్తోంది. అగ్రనాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న రష్మిక మందన్నకు ఈ రెమ్యునరేషన్‌ కష్టాలు తప్పవని అంటున్నారు. అనతికాలంలోనే దక్షిణాది తారాపథంలో దూసుకెళ్లిన ఈ కన్నడ సోయగం ప్రస్తుతం తెలుగులో భారీ సినిమాల్లో నటిస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ విజయాలతో తన తదుపరి సినిమాలకు భారీ పారితోషికాన్ని డిమాండ్‌ చేయాలని నిర్ణయించుకుందట. అయితే కరోనా కారణంగా ఆమె కోరినంత పారితోషికం దక్కే  పరిస్థితులు లేవని చెబుతున్నారు. తెలుగులో ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది రష్మిక. ఈ సినిమాకు ఆమె కోటిన్నర రెమ్యునరేషన్‌ అందుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. భవిష్యత్తులో ఆమె చేసే సినిమాలకు మరింత ఎక్కువ పారితోషికాలు ఆఫర్‌ చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారని తెలిసింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ఈ అమ్మడి రెమ్యునరేషన్‌ విషయంలో నిర్మాతలు పునరాలోచనలో పడ్డారని సమాచారం.


logo