మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 13:26:18

ప్రియుడు ప్ర‌పోజ్ చేసిన‌ప్ప‌టి ఫొటోను షేర్ చేసిన నేహా

ప్రియుడు ప్ర‌పోజ్ చేసిన‌ప్ప‌టి ఫొటోను షేర్ చేసిన నేహా

బాలీవుడ్ సింగ‌ర్ నేహా క‌క్క‌ర్ కొన్నాళ్ళుగా పంజాబీ గాయ‌కుడు రోహన్ ప్రీత్ సింగ్‌తో ప్రేమ‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరి వివాహం మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో రోకా వేడుక‌ను నిర్వ‌హించ‌గా, అందుకు సంబంధించిన ఫోటోల‌ని షేర్ చేసింది. ఇవి నేహా అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

తాజాగా రోహ‌న్ ప్రీత్ త‌న‌కు ప్ర‌పోజ్ చేసిన రోజుకు సంబంధించిన ఫోటోల‌ని షేర్ చేసింది. ఈ ఫోటోలకి `నాకు తన ప్రేమను తెలిపిన రోజు... నీతో జీవితం మరింత అందంగా ఉంటుంద`ని నేహ కామెంట్ చేసింది. ఫోటోల‌లో ఇద్ద‌రు ఆప్యాయంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తుండ‌గా, రోహ‌న్ చేతిలో న‌న్ను పెళ్ళి చేసుకుంటువా అని రాసి ఉన్న ప్ల‌క్కార్డ్ ఉంది.