మంగళవారం 14 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 11:20:18

నేహా ధూపియా ఆర్ట్ వ‌ర్క్‌కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

నేహా ధూపియా ఆర్ట్ వ‌ర్క్‌కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైంది. అత్య‌వ‌స‌రం అయిన కూడా ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టుగా ఇంటికి 2 కి.మీ లోపునే బ‌య‌ట తిరుగుతుంది. అయితే ఈ ఖాళీ స‌మ‌యంలో త‌న‌లో దాగి ఉన్న‌ ఆర్ట్ వ‌ర్క్ బ‌య‌ట‌పెట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దివ‌గంత న‌టులు ఇర్ఫాన్ ఖాన్, శ్రీదేవిల గ్రాఫిటీ ఆర్ట్ వ‌ర్క్ త‌న ఇంటికి రెండు కిలో మీట‌ర్ల దూరంలో వేసిన‌ట్టు నేహా త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా తెలిపింది. 

నేహా ధూపియాలో దాగి ఉన్న టాలెంట్ చూసి నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్యపోతున్నారు. ఇద్ద‌రు న‌టుల‌కి నివాళులు అర్పిస్తూ నేహా వేసిన ఈ ఆర్ట్ వ‌ర్క్ అక్క‌డ ప‌రిస‌రాల‌కి చెందిన వారిని కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. విల‌క్ష‌ణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఏప్రిల్ 29,2020న క్యాన్స‌ర్‌తో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆయ‌న క‌న్నుమూయ‌డంతో అభిమానులు చివ‌రి చూపు కూడా చూసుకోలేక‌పోయారు. logo